Tuesday, November 5, 2024

గొంతులో నుంచి ముఖంలోకి గుచ్చుకున్న చువ్వ

- Advertisement -
- Advertisement -

Iron rod enter into throat to eye

అమరావతి: కార్మికుడి గొంతులోని నుంచి ముఖంలోకి చువ్వ గుచ్చుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని అగనంపూడిలో జరిగింది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రాహుల్ సివాక్ (22) అనే యువకుడు హోమీ బాబా క్యాన్సర్ ఆస్పత్రిలోని మొదటి అంతస్తులో ఎలక్ట్రికల్ పనులు చేస్తున్నాడు. రాహుల్ మొదటి అంతస్తు నుంచి కింద జారి ఇనుప చువ్వల కట్టలపై పడ్డారు. ఓ చువ్వ రాహుల్ గొంతులో నుంచి ముఖంలోకి దిగబడింది. వెంటనే సహచర కార్మికులు అతడిని స్థానిక ఆర్‌కె ఆస్పత్రికి తరలించారు. డెంటల్ డాక్టర్ సునీల్, ఇఎన్‌టి సర్జన్ రాకేష్, జనరల్ వైద్యుడు కృష్ణమూర్తితో కూడిన బృందం రెండు గంటల పాటు శ్రమించి అతడికి శస్త్ర చికిత్స చేసి చువ్వను బయటకు తీశారు. అతడి ప్రాణాపాయం బయటపడ్డాడని వైద్యులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News