Sunday, November 17, 2024

ఎల్‌జికి మరిన్ని అధికారాలిచ్చే బిల్లును ఉపసంహరించాలి: ఢిల్లీ సిఎం కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

Amendment bill which binds more powers to LG should be withdrawn

 

న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు మరిన్ని అధికారాలను కట్టబెట్టే సవరణబిల్లును ఉపసంహరించుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. సవరణ బిల్లుకు నిరసనగా బుధవారం జంతర్‌మంతర్ వద్ద ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్) చేపట్టిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. ఆప్ ఎంఎల్‌ఎలు, కౌన్సిలర్లు, మంత్రులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ కేంద్రం చర్య ప్రజల్ని మోసం చేయడమేనన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఆప్ బలపడటం చూసి భయంతోనే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఢిల్లీ అభివృద్ధిని అడ్డుకునేందుకు సవరణ బిల్లు తెచ్చిందని కేజ్రీవాల్ విమర్శించారు. సోమవారం ఈ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News