Friday, November 22, 2024

ట్రంప్ గెలుపు కోసం పుతిన్ ఆరాటం

- Advertisement -
- Advertisement -

Russia's involvement in US presidential election

 

ఇంటలిజెన్స్ నివేదికలో వెల్లడి

వాషింగ్టన్ : గత ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రష్యా ప్రమేయం వెలుగులోకి వచ్చింది. నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ విజయం కోసం కార్యకలాపాలకు రష్యా అధ్యక్షులు పుతిన్ ప్రేరేపించారని రహస్య నిఘా సమాచారం విశ్లేషణలో వెల్లడైంది. ఏదో విధంగా ట్రంప్ గెలిచేందుకు అవసరం అయిన పరిస్థితి కల్పించేందుకు పుతిన్‌ సంకల్పించారు. ఈ మేరకు తన అధికార యంత్రాంగాన్ని తగు విధంగా రంగంలోకి దింపాడని ఈ విశ్లేషణలో స్పష్టం అయింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో రష్యా ప్రమేయం గురించి తరచూ ఆరోపణలు వెలువడుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేస్‌లో ఫలితాన్ని తారుమారు చేసేందుకు రష్యాతో పాటు ఇరాన్ కూడా ప్రయత్నిచిందని కనుగొన్నారు. అయితే ఫలితం తారుమారు అయ్యే దిశలో కానీ , ఓటింగ్ ప్రక్రియను దెబ్బతీసేందుకు కానీ ఏ విదేశీ శక్తి పాటుపడలేదని, దీనికి సంబంధించి ఎటువంటి సాక్షాధారాలు లేవని ఇంటలిజెన్స్ విశ్లేషణలో తేల్చారు.

2020 ఎన్నికలపై విదేశీ శక్తుల ప్రభావం గురించి తెలిపే సమగ్ర విశ్లేషణ ప్రక్రియను జాతీయ ఇంటలిజెన్స్ సంస్థ చేపట్టింది. తాము చేసిన సర్వేను సంబంధిత విభాగం డైరెక్టర్ కార్యాలయం తాజాగా విడుదల చేసిది. ఓట్లను ప్రభావితం చేసేందుకు, తద్వారా బైడెన్‌కు ప్రతికూలత తలెత్తేలా చేసేందుకు రష్యా ఇరాన్‌లు విశ్వప్రయత్నం చేశాయని ప్రస్తుత విశ్లేషణలో తెలిపారు. ఇంటలిజెన్స్ వాదనను రష్యా తోసిపుచ్చింది. అసంబద్ధమైన నిరాధారమైన విశ్లేషణ అని తెలిపింది. ఇదంతా కూడా రాజకీయ దురుద్ధేశాలతో కూడిన అతిక్రమణ అని రష్యా అధికారికంగా తెలిపింది. ఓ వైపు చైనా అమెరికాలో బైడెన్ రాకను కోరుకుంటూ వచ్చింది. దీనికి ప్రతిగా రష్యా ట్రంప్ పట్ల మొగ్గు కోసం పావులు కదిపిందని ఇప్పుడు వెల్లడైంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News