- Advertisement -
న్యూఢిల్లీ: ఇంధనం ధరలు తగ్గడం కోసం మహారాష్ట్రలాంటి రాష్ట్రాల్లో పన్నులను తగ్గించాలని కేంద్ర పెట్రోలియంశాఖమంత్రి ధర్మేంద్రప్రధాన్ సూచించారు. పెట్రోల్,డీజిల్‌పై ముంబయిలో పన్నులు అధికంగా విధిస్తున్నారని, తగ్గించి ఆ నగర ప్రజలకు ఊరట కలిగించాలని ఆయన అన్నారు. ఇంధన ధరలు పెరగడంపై రాజ్యసభలో శివసేన ఎంపి అనిల్‌దేశాయ్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రధాన్ ఈ సూచన చేశారు. కేంద్రం పన్నుల్ని తగ్గించకపోవడంపై ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఇప్పటికే సమాధానమిచ్చారని ప్రధాన్ అన్నారు.
- Advertisement -