లక్నో: సౌతాఫ్రికాతో జరిగిన ఐదో, చివరి వన్డేలోనూ భారత మహిళా జట్టు ఓటమి పాలైంది. బుధవారం జరిగిన చివరి వన్డేలో సౌతాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ గెలుపుతో సిరీస్‌ను సౌతాఫ్రికా విమెన్స్ జట్టు 41తో కైవసం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 49.3 ఓవర్లలో 188 పరుగులకే ఆలౌటైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ (30) రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన మిథాలీరాజ్ 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో 79 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. మిగతావారు విఫలమయ్యారు. దీంతో భారత్ ఇన్నింగ్స్ తక్కువ పరుగులకే పరిమితమైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 48.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఒక దశలో 27 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను మిగ్నన్ డు ప్రీజ్ (57), అన్నె బోచ్ (58) ఆదుకున్నారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. మరిజానే కాప్ 36 (నాటౌట్), నడైన్ డి క్లార్క్ 19 (నాటౌట్) తమవంతు పాత్ర పోషించడంతో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది.
SA Women Won ODI Series 4-1 against IND Women