- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటలలో 31,165మందికి పరీక్షలు చేయగా, కొత్తగా 218 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.కరోనా వల్ల ఎటువంటి మరణం సంభవించలేదని తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం 8,92,740 కరోనా పాజిటీవ్ కేసుల నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారిసంఖ్య 7,186కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1795మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 117 మంది కోలుకోగా.. ఇప్పవటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8లక్షల 83 వేలకు పైగా కరోనా బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోటీ 46 లక్షలకు పైగా శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
218 New Corona Cases Registered in AP
- Advertisement -