Saturday, November 23, 2024

నల్లగొండ ఎంఎల్‌సి ఎన్నికల్లో 48 మంది అభ్యర్థుల ఎలిమినేట్

- Advertisement -
- Advertisement -

Eliminate 48 candidates in nalgonda mlc elections

హైదరాబాద్‌: నల్గొండ – ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల ఓట్ల లెక్కింపు‌ ప్రక్రియ శుక్రవారం కొనసాగుతున్నది. మొదటి ప్రాధాన్య ఓట్లలో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. తొలి ప్రాధాన్యం ఓట్లలో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. ఈ స్థానం నుంచి ఎన్నికల్లో 71 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇప్పటివరకు 48 మంది అభ్యర్థులను అధికారులు ఎలిమినేట్‌ చేశారు. వారికి వచ్చిన ఓట్లను తొలి ఐదు స్థానాల్లో ఉన్న అభ్యర్థులకు బదలాయించారు. టిఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 250 ఓట్లు, స్వతంత్య అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు 210, ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు 290 ఓట్లు బదలాయించారు. దీంతో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఇప్పటి వరకు వచ్చిన ఓట్లు 1,11,090 సంఖ్యకు చేరిందని అధికారులు తెలిపారు. తీన్మార్‌ మల్లన్న 83,500, కోదండరామ్‌కు 70,362 ఓట్లు పోలయ్యాయి. అభ్యర్థి విజయానికి 1,83,167 ఓట్లు అవసరమని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News