Friday, November 22, 2024

రాష్ట్రంలో మరో 313 మందికి వైరస్

- Advertisement -
- Advertisement -

313 new covid-19 cases reported in telangana

 

జిహెచ్‌ఎంసి పరిధిలో 47, జిల్లాల్లో 266 మందికి పాజిటివ్
వైరస్ దాడిలో ఇద్దరు మృతి
3,02,360కి చేరిన కరోనా బాధితుల సంఖ్య

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 313 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 47, జిల్లాల్లో 266 మందికి పాజిటివ్ తేలింది. అదే విధంగా కొవిడ్ దాడిలో మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 3,02,360కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,98,262కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు తెలిపారు. మాస్కు, భౌతిక దూరం, శానిటేషన్‌తోనే వైరస్ నుంచి దూరంగా ఉండొచ్చని ఆయన అన్నారు. ముఖ్యంగా జనసమ్మర్ధ ప్రాంతాలు, మార్కెట్లలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

రాజన్న సిరిసిల్లా జిల్లాలో కరోనా కలకలం..

రాజన్న సిరిసిల్లా జిల్లాలో కరోనా కలకలం రేకెత్తిస్తుంది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రెండు బాలికల పాఠశాలలు కలిపి 37 మందికి పాజిటివ్ తేలింది. దీనిలో ఐదుగురు ఉపాధ్యాయులకూ కరోనా సోకింది. అంతేగాక కోనరావుపేట్ మండలంలోని కస్తుర్బా గాంధీ బాలికల పాఠశాలలో 15 మంది విద్యార్ధినులకు కొవిడ్ తేలింది. దీంతో బాధితులకు చికిత్స అందిస్తూ మిగతా వారందరిని ఐసోలేషన్‌లో ఉంచినట్లు వైద్యాధికారులు తెలిపారు.

కేసులు మళ్లీ పెరుగుతున్నాయి..

గత వారం రోజుల నుంచి కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లల్లోనే ఎక్కువ మందికి వస్తున్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. జిహెచ్‌ఎంసితో పాటు కామారెడ్డి, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, జిల్లాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News