Saturday, November 23, 2024

రైళ్లలో సిగరెట్ తాగితే భారీ జరిమానా

- Advertisement -
- Advertisement -

Heavy fines for smoking cigarettes on Trains

 

రైల్వే కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి రైల్వే కంపార్ట్‌మెంట్లలో ఎవరైనాప్రయాణికులు ధూమపానం(సిగరెట్, బీడీ వగైరా) చేస్తే భారీ జరిమానా విధించనుంది. ధూమపానం చేసే ప్రయాణికుడి వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటే వారిని అరెస్టు కూడా చేయాలని యోచిస్తోంది. ఇఇటీవల న్యూఢిల్లీడెహ్రాడూన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ ట్రైన్ కంపార్ట్‌మెంట్‌లో ధూమపానం చేసిన ప్రయాణికుడు సిగరెట్ తాగి పీకలను టాయిలెట్‌లోని డస్ట్‌బిన్‌లో వేయడంతో అక్కడున్న టిష్యూ పేపర్‌కు అంటుకొని అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

దీంతో భారతీయ రైల్వే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని ఈ కీలక నిర్ణయం తీసుకొంది. ధూమపానం చేసిన వారికి భారీ జరిమానా విధించడంతో పాటు అవసరమైతే అరెస్టు కూడా చేస్తామని పేర్కొంది. అయితే ప్రస్తుత రైల్వే చట్టంలోని 167వ సెక్షన్ ప్రకారం రైల్వే కంపార్ట్‌మెంట్‌లో ధూమపానం చేసిన వారికి అధికారులు రూ.100 జరిమానా విధిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల రైల్వే మంత్రి పీయూష్ గోయల్ రైళ్లలో ధూమపానం చేసే ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకోవాలని జోనల్ జనరల్ మేనేజర్లను, రైల్వే బోర్డు సభ్యులను ఆదేశించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News