Friday, November 1, 2024

బ్రెజిల్ లో ఒక్క రోజే 3251 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Brazil coronavirus death toll rises sharply

బ్రసిలియా: బ్రెజిల్ దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దీంతో బ్రెజిల్ దేశంలో శవాల దిబ్బగా మారింది. సావో నగరంలో వెయ్యి మంది పైగా చనిపోవడంతో ఎటు చూసిన శవాలు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. మంగళవారం ఒక్క రోజే కరోనా వైరస్‌తో 3251 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 84 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకు కరోనా కేసులతో మరణాలతో పెరుగుతుండడంతో బ్రెజిల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కేసుల సంఖ్యలో అమెరికా(3.06 కోట్లు) తొలి స్థానంలో ఉండగా బ్రెజిల్( 1.21 కోట్లు) రెండో స్థానం, భారత్ (1.17 కోటు) మూడోస్థానం, రష్యా(44.74 లక్షలు) నాలుగో స్థానంలో ఉంది. కరోనాతో మృతి చెందిన వారి విషయంలో అమెరికా(5.56 లక్షలు) తొలి స్థానం ఉండగా వరసగా బ్రెజిల్(2.98 లక్షలు), మెక్సికో(1.99 లక్షలు), భారత్(1.6 లక్షలు), యుకె(1.26 లక్షలు), ఇటలీ(1.05 లక్షలు), రష్యా (95 వేలు) దేశాలు ఉన్నాయి. ప్రపంచం వ్యాప్తంగా 12.47 కోట్ల మందికి కరోనా వైరస్ సోకగా 27.46 లక్షల మంది మరణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News