- Advertisement -
హైదరాబాద్: గ్రామాలలో శవ దహన శాలలు, డంపింగ్ యార్డులు, చెత్తను వేరు చేసే షెడ్ల నిర్మాణం చేపట్టామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. కుల, మతాలకు అతీతంగా వైకుంఠదామాలు నిర్మిస్తున్నామన్నారు. గ్రామాల్లో అన్ని రకాల మొక్కలతో నర్సరీలు ఉన్నాయని, గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల్లో పిల్లల కోసం ఆట స్థలాలు ఏర్పాటు చేశామని వివరించారు. తెలంగాణలో అనేక పంచాయతీలకు జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయని, కేంద్రం నుంచి గ్రామాలకు నిధులు మాత్రం రావడంలేదని మండిపడ్డారు. తెలంగాణలో గ్రామాల అభివృద్ధి, ఉపాధిహామీ అమలుపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు పశంసిస్తున్నారని, గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చే గ్రాంట్ తగ్గించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -