వాషింగ్టన్: కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సర్జన్ జనరల్‌గా భారతీయ-అమెరికన్ వైద్యుడు డాక్టర్ వివేక్ మూర్తి నియమితులయ్యారు. ఆయన పేరును అమెరికన్ సెనేట్ మంగళవారం ఖరారు చేసింది. 43 సంవత్సరాల డాక్టర్ వివేక్ మూర్తి ఈ పదవిని చేపట్టడం ఇది రెండవసారి. గతంలో, 2011లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాకు ఆయన సర్జన్ జనరల్‌గా పనిచేశారు.అమెరికా అధ్యక్షుడి సర్జన్ జనరల్‌గా తనను ఎంపిక చేసినందుకు డాక్టర్ వివేక్ మూర్తి సెనేట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గడచిన ఏడాది కాలంగా దేశం ఎన్నో కష్టాలను ఎదుర్కొందని, వీటిని అధిగమించేందుకు తన వంతుగా సంపూర్ణంగా కృషి చేస్తానని ఆయన తెలిపారు. 2013లో డాక్టర్ వివేక్ మూర్తిని ఒబామా సర్జన్ జనరల్‌గా నియమించారు. అమెరికా చరిత్రలోనే 37 ఏళ్ల వయసులో ఆ పదవిని చేపట్టిన అతి పిన్నవయస్కునిగా ఆయన పేరు గడించారు. అయితే ఆ తర్వాత అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టడంతో అర్ధాంతరంగా డాక్టర్ మూర్తి బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
అమెరికా సర్జన్ జనరల్‌గా డాక్టర్ వివేక్ మూర్తి ఎంపిక
- Advertisement -
- Advertisement -
- Advertisement -