స్వచ్ఛత మన బాధ్యత.. తడి, పొడి చెత్తను వేరుచేయండి
హైదరాబాద్‌లో 2,500 తోడు మరో 650 స్వచ్ఛ ఆటోలు ప్రారంభం జెండా ఊపిన మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/సిటీ బ్యూరో: నగర స్వచ్ఛత విషయంలో ప్రభుత్వం, జిహెచ్‌ఎంసిలతో పాటు ప్రతి ఒక్కరి భాద్యత వహించాలని పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. చెత్త సేకరణకు జిహెచ్‌ఎంసి 650 అత్యాధునిక స్వచ్చ ఆటో టిప్పర్లను గురువారం నెక్లెస్ రోడ్డులోని పిపుల్స్ ప్లాజా వద్ద పురపాలక శా ఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్చంధగా తమ ఇళ్లలోని చెత్తను పోడి, తడి చెత్తను వేరు చేసి స్వచ్చ ఆటోలకు అందించాలని నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరాన్ని బిన్‌లెస్‌సిటీగా మార్చే ప్రక్రియలో భాగంగా ఇం టింటికి చెత్త సేకరణను మరింత ముమ్మరం చేశామని తెలిపారు. ఇందుకు ప్రభుత్వం అందజేసిన చెత్త బుట్టలను పూర్తిగా వినియోగించడం ద్వారా నగర పరిశుభ్రతలో నగర పౌరులు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలన్నారు. పారుశుద్దత విషయంలో ప్రత్యేక ఎజెండాతో ముందుకు సాగుతున్నామని, ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న 2500 స్వచ్చ ఆటోలకు అదనంగా మరో 650 స్వచ్చ ఆటోలను ప్రవేశపెడుతున్నట్లు మంత్రి కెటిఆర్ వెల్లడించారు. అంతేకాకుండా కలెక్షన్ టాన్స్‌ఫర్ స్టేషన్లను గణనీయంగా పెంచడంతో పాటు రెప్యూజ్ కాంపాక్టర్లను ఇప్పటీకే ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. కరోనా రెండవ విడత విజృంభిస్తోందన్న వార్తల నేపథ్యంలో లాక్ డౌన్ కాలంలో చేపట్టిన విధంగానే మరింత సమర్థవంతంగా పారిశుద్ద కార్యక్రమాలను నిర్వహించాలని, ఇందుకు మరింత శద్ద్ర వహించాల్సిందిగా అధికారులు, సిబ్బందికి మంత్రి కెటిఆర్ సూచించారు. అత్యధునిక స్వచ్చ ఆటో టిప్పర్లను సైతం డ్రైవర్ కబ్ ఓనర్ విధానంలోనే అందజేశారు.కాగా ఒక్కో స్వచ్ఛ ఆటో 3.5 క్యూబిక్ మీటర్ వైశాల్యం తో 1.5 మెట్రిక్ టన్నుల గార్బజ్ తరలిస్తుంది. 650 ఆటోలకు సంబంధించి మొత్తం వ్యయం రూ.44,63,55,650 రుణాన్ని కెనరా బ్యాంక్ అందజేసింది. ఒక్కొ ఆటో ధర రూ.6,86,701 కాగా ఇందులో లబ్దిదారుడి వాట 10 శాతం పోగా, మిగిలిన 90 శాతం రుణాన్ని 8 శాతం వార్షిక వడ్డీతో 72 నెలల్లో కెనరా బ్యాంక్‌కు జిహెచ్‌ఎంసి చెల్లించనుంది.ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి, జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, అదనపు కమిషనర్ బి.సంతోష్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రావిణ్యతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
KTR launches Swachh Auto vehicles at Necklace Road