Sunday, November 3, 2024

సర్కారియా కమిషన్ చెప్పినా మోడీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రాల మధ్య తారతమ్యాలుంటాయని సిఎం కెసిఆర్ తెలిపారు. రిజర్వేషన్లను రాష్ట్రాల విజ్ఞతకే వదిలేయమని చెప్పినా కూడా కేంద్రం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు యాబై శాతం రిజర్వేషన్లు దాటొద్దని చెబుతోందన్నారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమియ బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. ద్రవ్య వినిమయ బిల్లు చర్చలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు అని కెసిఆర్ చెప్పారు. ద్రవ్య విధానం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉందన్నారు. తెలంగాణ హక్కులను, బాధ్యతలను కేంద్రం హరించి వేస్తుందని, ఉమ్మడి అధికారాలు పేరుకే ఉన్నాయని, కాంగ్రెస్ నుంచి బిజెపి వరకు ఉమ్మడి అధికారాలపై వివక్ష చూపుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిందిపోయి హరిస్తూ వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలను సర్కారియా కమిషన్ చెప్పినా కూడా కేంద్రం వినడం లేదన్నారు.

పాతబస్తీకి మెట్రో రైలు కనెక్టివిటీ తప్పకుండా నెరవేరుస్తామని, ఒక్కసారి చెప్పామంటే కచ్చితంగా చేస్తామని, వృద్ధాప్య పించన్లు వయసు త్వరలో 57 ఏళ్లకు తగ్గిస్తామని చెప్పి తగ్గించామన్నారు. స్వాతంత్య్రం వచ్చాక భారత దేశ తొలి బడ్జెట్ రూ.190 కోట్లు అని సిఎం కెసిఆర్ గుర్తు చేశారు. రూ.190 కోట్లలో 92 కోట్లు రక్షణ శాఖకే కేటాయించారని, రాను రాను బడ్జెట్ వందల కోట్ల నుంచి లక్షల కోట్లకు చేరుకుందన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు పాడిందే పాటరా అన్నట్టుగా వ్యవహరించారని చురకలంటించారు. ప్రతిపక్షాలు ఒకే మూసలో పని చేస్తున్నాయన్నారు. సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతిపక్షాలు నిర్మాణాత్మక, వ్యూహాత్మకమైన చర్చ చేయలేదని ఎద్దేవా చేశారు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్లాలంటే నిర్మాణాత్మక సూచనలు రావాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News