ఓయూలో జాబ్‌మేళా
పాల్గొన్న నగర సిపి అంజనీకుమార్
35 కంపెనీలు రాక, రిజిస్ట్రేషన్ చేసుకున్న 4,000మంది నిరుద్యోగులు
హైదరాబాద్: నిరుద్యోగులు కష్టపడి ఉద్యోగాలు సంపాధించాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్‌లో శనివారం జాబ్ మేళా నిర్వహించారు. నిరుదోగ్యులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు 35కంపెనీలు ముందుకు వచ్చాయి. 4,000మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. టిఎంఐ గ్రూపు సహకారంతో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని సిపి అంజనీకుమార్ అన్నారు. జాబ్ కనెక్టివిటీ ఉద్యోగాలు పొందేందుకు దగ్గరి మార్గమని అన్నారు. ఉద్యోగం పొందిన వారు కష్టపడి మరింత ఉన్నత ఉద్యోగం పొందేందుకు కృషి చేయాలని కోరారు. ప్రతి నెల నగర పోలీసుల ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉద్యోగాలు పొందిన వారికి సిపి అంజనీకుమార్ అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేశారు. కార్యక్రమంలో ఓయూ ప్రొఫెసర్ గణేష్, జాయింట్ సిపి రమేష్, ఎడిసిపి మురళీధర్, ఎసిపి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.