న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దీంతో ఈ ఏడాది కూడా భద్రాద్రిలో శ్రీరామ నవమి వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గత ఏడాది నిర్వహించినట్లుగానే కరోనా నిబంధనలకు అనుగుణంగా శ్రీరామనవమి వేడుకను నిర్వహిస్తామని చెప్పారు. సీతారామ కల్యాణం చూడడానికి భద్రాద్రికి భక్తులెవరూ రావద్దన్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా టివిల్లో చూడాలన్నారు. ఆన్‌లైన్ లో కల్యాణ టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఆ డబ్బులను తిరిగి చెల్లిస్తామని ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో ఉన్న రామాలయాల్లో కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ భక్తులకు దర్శనాలు కల్పిస్తామన్నారు.
Corona restrictions on Bhadradri Sri Rama Navami