Friday, November 22, 2024

సచిన్-‌గంగూలీ తర్వాత రోహిత్, ధావన్‌లే

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్ జట్టుతో జరుగిన మూడో వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ అరుదైన రికార్డు సాధించారు. వన్డేలలో 5000కు పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతర్జాతీయ వన్డేల్లో ఈ ఘనత సాధించిన ఏడో జోడీగా నిలిచారు. వన్డేల్లో అందరికన్నా ఎక్కువ పరుగులు సాధించింది సచిన్ తెండూల్కర్, సౌరబ్ గంగూలీ జోడీనే. వీరిద్దరూ తొలి వికెట్‌కు 8,227 పరుగులు జోడించారు.ఆ తర్వాత మరెవ్వరూ వీరికి దరిదాపుల్లోకి కూడా రాలేదు. సంగక్కరజయవర్దనె, దిల్షాన్ సంగక్కర, జయసూర్యఅటపట్టు, గిల్‌క్రిస్ట్‌హేడెన్, గ్రీనిడ్జ్ హెయిన్స్ జోడీలు కూడా 5 వేలకు పైగా పరుగులు సాధించిన జోడీలుగా ఉండగా ఇప్పుడు రోహిత్ శర్మశిఖర్ ధావన్ కూడా ఈ జాబితాలో చేరారు.

Rohit and Dhawan complete 5000 partnership in ODI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News