టీ వాలెట్ ద్వారా భారీగా చెల్లింపులు
మరింత అభివృద్ధి చేయాలంటున్న వినియోగదారులు
సరైన పద్ధతిలో అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఆదాయం ఆదా
మన తెలంగాణ/సిటీబ్యూరో: ఒకప్పుడు విద్యుత్ బిల్లులు చెల్లింపులు చేయాలంటే చాంతాడంత క్యూలో గంటల తరబడినిలడాల్సి వచ్చేది. దీంతో విద్యుత్ వినియోగదారులకు ఎంతో సమయం వృథా అయ్యేది. దీంతో పాటు కేవలం విద్యుత్ బిల్లుల చెల్లింపుల కోసం ప్రత్యేకంగా తమ దైనందిత కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేసుకోవాల్సి వచ్చేది. కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బిల్లుల చెల్లింపుల్లో అనేక మార్పులు చ్చాయి. దానిలో బాగంగా కొంత మంది విద్యుత్ వినియోగదారులు సమీపంలోని మీ సేవా కేంద్రాల్లో బిల్లులను చెల్లిస్తుంటుంటే మరి కొంత మంది ఆన్‌లైన్ చెల్లిస్తున్నారు. అంతే కాకుండా వినియోగదారులకు బిల్లులు చెల్లింపుల కార్యక్రమాన్ని మరింత సులభతరంగా చేసేందుకు కొన్ని యాప్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతో చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు క్షణాల్లో పే మెంట్ పూర్తవుతోంది.
వీటికి తోడు ప్రభుత్వం టీ వాలెట్‌ను కూడా అందుబాటులోకి యాప్ ద్వారా ప్రభుత్వ విభాగాలకు చెందిన బిల్లులను అంటే విద్యుత్, నీటి బిల్లు చెల్లింపులు, హెచ్‌ఎండిఏకు సంబంధించి అవుటర్ రింగ్‌రోడ్డు మీట టోలకు సంబంధించి రుసుమలతో పాటు, జిహెచ్‌ఎంకి చెల్లించాల్సిన పలురకాల సేవలకు సంబంధించిన సేవల బిల్లులు ఈ యాప్ ద్వారా చెల్లించవచ్చు. గ్రేటర్‌లో హైదరాబాద్‌లో సుమారు 53 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా సుమారు గృహవిద్యుత్ వినియోగదారులు 48 లక్షలు ఉండగా మిగిలి వాటిలో హెచ్‌టి, పరిశ్రమలకు సంబంధించిన కనెక్షన్లు ఉన్నాయి. వీటి ద్వారా విద్యుత్ సంస్థలకు రూ.1000 కోట్లు ఆదాయం వస్తుంది. అయితే టి యాప్ ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి సమారు రూ. 600 కోట్లు చెల్లింపులు జరుగుతున్నాయి.
విద్యుత్ బిల్లులకు సంబంధించి రూ.1000 కోట్లు ఉండగా వీటిలో సుమారు రూ.400 కోట్లు గృహ విద్యుత్‌వినియోగదారు నుంచి వస్తుంటే మిగిలిన రూ.200 కోట్లు హెచ్‌టి, పారిశ్రామిక సంస్థలకు సంబంధించిన విద్యుత్ వినియోగదారులు చెల్లిస్తున్నారు. అయితే బిల్లుల చెల్లింపుల ప్రక్రియ సజావుగా జరిగేందుకు ప్రభుత్వం యాప్‌లను సాయం తీసుకుంటోంది. దీని ద్వారా సదరు యాప్‌ల నిర్వాహకులకు 2.5 మొత్తాన్ని నిర్వహణ చార్జీల రూపంలో చెల్లిస్తోంది. ఉదాహరణకు బిల్లుల చెల్లింపుల ద్వారా రూ.500 కోట్ల లావాదేవీలు జరిగాయనుకుంటే యాప్‌ల నిర్వహణ సంస్థలు రూ. 2.50 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఈ విధంగా ఒక్క విద్యుత్ బిల్లులు చెల్లింపుల ద్వారా యాప్ నిర్వహణ సంస్థలకు రూ.2.50 కోట్లు పోతుంటే మిగతా మిగిలిన ప్రభుత్వ విభాగాలైన వాటర్ వర్క్, హెచ్‌ఎండి, జిహెచ్‌ఎంసి సంస్థల ద్వారా ఎంతో మొత్తం యాప్ నిర్వహణ సంస్థలకు చార్జీలు రూపంలో పోతుందో ఇట్టే అర్దం చేసుకోవచ్చు. టీ వాలెట్‌ను మరింత అభివృద్ధ్ది చేస్తే చార్జీలు రూపంలో ఆయా సంస్థలకు వెళ్ళే ఆదాయం ప్రభుత్వానికే మిగులుతుందని, ఆ మొత్తాన్ని ఇతర అభవృద్ధి కార్యక్రమాలకు వినియోగించు కోచ్చనే అభిప్రాయాన్ని వినియోగదారులు వ్యక్తం చేస్తున్నారు.