ఆంకోరేజ్(అమెరికా): అలాస్కాలో విహారయాత్ర విషాదాన్ని మిగిల్చింది. ఒక అద్దె హెలికాప్టర్ కూలిపోయి ఐదుగురు మరణించారు. మృతులలో పైలట్‌తోపాటు మరో ఇద్దరు గైడ్లు, ఇద్దరు అతిథులు ఉన్నారని, ఒక వ్యక్తి తీవ్ర గాయాలతో ఆంకోరేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అలాస్కా ప్రభుత్వం ఆదివారం తెలిపింది. మృతులలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన అత్యంత సంపన్నుడు పెట్ కెల్నర్(56) తెలిపింది. 2020 సంవత్సరానికి సంబంధించి ఫోర్బ్ ప్రకటించిన అత్యంత సంపన్నుల జాబితాలో కెల్నర్ ఉన్నారు. ఫోర్బ్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ 17 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉంటుంది. శనివారం వీరంతా పర్వత ప్రాంతాలలో హెలీ-స్కీయింగ్ పర్యటన నిమిత్తం యూరోకాప్టర్ ఎఎస్50లో బయల్దేరి వెళ్లారని, శనివారం సాయంత్రం 6.35 ప్రాంతంలో ఆంకోరేజ్‌కు 80 కిలోమీటర్ల దూరంలో హెలికాప్టర్ కూలిపోయిందని అలాస్కా ప్రభుత్వం ఆదివారం తెలిపింది. వెంటనే సహాయక బృందాలు ప్రమాదం జరిగిన పర్వత ప్రాంతాలకు తరలివెళ్లాయని, రాత్రి 10 గంటల ప్రాంతంలో నిక్ గ్లేసియర్ సమీపంలో మృతదేహాలు లభించాయని తెలిపింది. తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు వివరించింది.
Czech Republic’s Richest Man dies in helicopter crash