Monday, November 25, 2024

కాటన్ దిగుమతులపై నిషేధం తొలగించాలని పాక్ జౌళిశాఖ సిఫారసు

- Advertisement -
- Advertisement -

Pakistan’s Textile Ministry asks India to lift ban on import of cotton

 

ఇస్లామాబాద్: భారత్ నుంచి కాటన్(దూది), కాటన్ యార్న్ దిగుమతులపై నిషేధం తొలగించాలని పాకిస్థాన్ జౌళి మంత్రిత్వశాఖ సిఫారసు చేసింది. జౌళిశాఖకు ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఇంచార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. జౌళిశాఖ నిర్ణయానికి ఆర్థిక సహకార సంఘం(ఇసిసి) నుంచి అనుమతి లభించాలి. ఆ తర్వాత కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుంది. పాకిస్థాన్‌లోని జౌళి పరిశ్రమకు అవసరమైన ముడి సరుకుకు కొరత ఏర్పడింది. ఇతర దేశాల నుంచి దిగుమతులు వస్తున్నా అవి సరిపోవడంలేదు. దాంతో, భారత్ నుంచి దిగుమతి చేసుకోవడం పాక్‌కు తప్పనిసరైంది. 2019లో జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేయడాన్ని నిరసించిన పాకిస్థాన్, భారత్‌తో వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకున్నది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News