- Advertisement -
కేప్‌కెనవెరెల్ : స్పేస్‌ఎక్స్ ప్రయోగించిన పరీక్ష రాకెట్ మంగళవారం ల్యాండింగ్‌లో విఫలమైంది. భవిష్యత్ ప్రణాళికతో ప్రోటోటైప్ మార్స్ రాకెట్ రీతిలో రూపొందించిన ఈ బులెట్ ఆకారం స్టార్‌షిప్ నేలకు చేరుకునే లోపలే విఫలమైంది. రాకెట్‌పై ఉన్న కెమెరా కనీసం ఆరు నిమిషాలైనా పని చేయకుండా గడ్డకట్టుకు పోయింది. రాకెట్ శిధిలాలు కిందకు జారి పడి పేలుడు సంభవించింది. మెక్సికో సరిహద్దు సమీపాన ప్రయోగానికి, ల్యాండ్ అవడానికి ఎంపికైన స్థలం చేరకుండానే ఇది విఫలమైందని స్పేస్‌ఎక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.
- Advertisement -