- Advertisement -
న్యూఢిల్లీ : అసోం చరిత్ర, భాష, సంస్కృతిపై దాడికే పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో కాంగ్రెస్ను, కాంగ్రెస్ మహాకూటమిని గెలిపిస్తే అలాంటి చట్టాన్ని అమలు కానీయబోమని ఆయన హామీ ఇచ్చారు.గిరిజనుల ఆర్టికల్ 254 ఎ ను రద్దు చేయడానికి బిజెపి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అసోంలో ఆయన మంగళవారం ఎన్నికల ప్రచారం సాగించాల్సి ఉండగా వాతావరణం అనుకూలించక పోవడంతో పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ సందర్భంగా తమకు ఓట్లు వేయాలని కోరుతూ వీడియో ట్విటర్ ద్వారా విడుదల చేశారు. సిఎఎ అమలు కాకుండా చూడడం, ఐదు లక్షల మంది యువతకు ఉద్యోగాల కల్పన, తేయాకు తోటల కార్మికులకు కనీస వేతనం రూ. 365, ప్రతి కుటుంబానికి ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్, ప్రతి కుటుంబానికి రూ.2000 సహాయం, తదితర ఐదు గ్యారంటీలు తాము ఇస్తున్నామని రాహుల్ ప్రకటించారు.
- Advertisement -