స్కోర్: ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్ అత్యంత వివాదాస్పదంగా మారిన నిబంధన ఏదైన ఉందంటే అని సాఫ్ట్ సిగ్నల్ విధానం మాత్రమే. ఇటీవల ఇంగ్లండ్‌భారత్ జట్ల మధ్య జరిగిన సిరీస్‌లో ఈ నిబంధనపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈసారి ఐపిఎల్‌లో సాఫ్ట్ సిగ్నల్ నిబంధనను అమలు చేయకూడదని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. దీంతో ఈసారి ఐపిఎల్‌లో సాఫ్ట్ సిగ్నల్ నిబంధన ఉండదు. క్యాచ్, అబ్‌స్ట్రక్ట్ ద బాల్ వంటి నిర్ణయాల విషయంలో సాంకేతిక ఆధారంగా మూడో అంపైర్‌కు స్పష్టత రానప్పుడు ఫీల్డ్ అంపైర్ ముందుగా ప్రకటించిన నిర్ణయాన్నే పరిగణలోకి తీసుకుంటాడు. దీన్నే సాఫ్ట్ సిగ్నల్‌గా పిలుస్తారు. కొత్త నిబంధన ప్రకారం ఫీల్డ్ అంపైర్ నిర్ణయంతో సంబంధం లేకుండా మూడో అంపైరే సాంకేతిక సాయంతో లభించిన స్పష్టత మేరకు తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడు. ఇక షార్ట్ రన్ విషయంలో కూడా నిబంధనలను బిసిసిఐ మార్చింది. బ్యాట్స్‌మన్ పరుగు సరిగ్గా పూర్తి చేశాడా లేదా అనే విషయంలో అంపైర్ సరైన నిర్ణయం ప్రకటించలేదని భావిస్తే దాన్ని మార్చే నిర్ణయం మూడో అంపైర్‌కు ఉంటుంది.