Friday, October 18, 2024

వంటగ్యాస్ ధర రూ.10 తగ్గింపు

- Advertisement -
- Advertisement -

LPG cylinder price reduced by Rs 10

నేటి నుంచే అమలులోకి

న్యూఢిల్లీ: ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.10 తగ్గించారు. దీంతో, ఢిల్లీలో 14.2 కిలోల ఇండేన్ ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.809 అయింది. మిగతా కంపెనీలు కూడా ఇదేమేరకు తగ్తిస్తాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఒసిఎల్) బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. తగ్గిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల నేపథ్యంలోనే వంటగ్యాస్ ధర తగ్గించారని పరిశీలకులు భావిస్తున్నారు. ఐఒసిఎల్ మాత్రం అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News