అగర్తలా: ఇద్దరు బాలికలపై ఎనిమిది మంది అత్యాచారం చేసిన సంఘటన త్రిపురలోని ఖౌవాయి జిల్లా ఖటియబరి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఇద్దరు బాలికలు తన బాయ్ ఫ్రెండ్స్‌తో కలిసి ద్విచక్రవాహనాలపై బయటకు వెళ్లారు. కొంచెం దూరం వెళ్లిన తరువాత వారికి మరో ఆరుగురు స్నేహితులు తోడయ్యారు. రాత్రి ఏడున్నర గంటల సమయంలో వారిని దట్టమైన అడవిలో తీసుకెళ్లి ఇద్దరు బాలికలపై ఎనిమిది మంది అత్యాచారం చేయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. బాలిక నుంచి ఉలుకుపలుకు లేకపోవడంతో స్థానిక నిందితులు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. తల్లిదండ్రులు పోలీసుల సహాయంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలిక దారుణమైన స్థితిలో ఉండడం చూసి గుండెలు బాదుకొని ఏడ్చారు. అనంతరం వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఒక బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.