Sunday, November 17, 2024

ఎపిలో మరో 1,271 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

1271 new covid-19 cases reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కొన్నాళ్లగా సైలెంట్ గా ఉన్న కరోనా మహమ్మారి తిరిగి విజృంభిస్తుంది. ఎపిలో గత 24 గంటల్లో 1,271 మందికి కరోనా వైరస్ సోకింది. మరో ముగ్గురు మృతి చెందారు. అదే సమయంలో 464 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,03,260కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,87,898 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఆంధ్రలో ప్రస్తుతం 8,142 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కరోనా మరణాలు 7,220కి పెరిగాయి. గత 24గంటల్లో 31,809 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు. కొత్తగా నమోదైన కేసుల్లో చిత్తూరులో 285, గుంటూరులో 279, విశాఖలో 189 కేసులు, కృష్ణాలో 161 కరోనా కేసులు బయటపడ్డాయి.

1271 new covid-19 cases reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News