Friday, November 22, 2024

కోరలు చాస్తున్న కరోనా…

- Advertisement -
- Advertisement -

భారీగా పెరుగుతున్న కరోనా మహమ్మారి
నగరంలో తాజాగా 201కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య
కొన్ని ప్రాంతాల్లో ఇంకా నిర్లక్షం వీడని ప్రజలు
మాస్కులు ధరించకుంటే జరిమానాలు
బస్తీదవఖానాలు, ఆరోగ్య కేంద్రాల్లో టెస్టుల కోసం జనం బారులు
కొవిడ్ నిబంధనలు పాటించకపోతే ముప్పతప్పదని వైద్యుల హెచ్చరికలు

Corona Virus more spread in Telangana

మన తెలంగాణ/సిటీబ్యూరో: మహానగరంపై కరోనా మహమ్మారి రె క్కలు కట్టుకుని ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. గత వారం రో జుల నుంచి రోజుకు 40నుంచి 50కి పైగా కొత్త కేసులు నమోదైతున్నాయి. తాజగా పాజిటివ్ కేసుల సంఖ్య 201 చేరడంతో ఈనెలాఖరు వరకు కరోనా మరింత విస్తరించే ప్రమాదముందని వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెలల్లో పాఠశాల, వసతిగృహాలకు చెందిన విద్యార్దులతో ప్రారంభమైన సేకండ్ వేవ్ కరోనా రోజు రోజుకు విజృంభణ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది.

ఇప్పటికే ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగులకు నిండిపోయాయి. ప్రభుత్వం ఆసుపత్రులైన గాంధీ, టిమ్స్, ఫీవర్, కింగ్‌కోఠి, చాతి ఆసుపత్రుల్లో కూడా రోగుల సంఖ్య పెరుగుతుందని ఆసుపత్రులు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. మార్చి నెల మొదటి వారంలో మహారాష్ట్రలో వేగంగా విస్తరించి వైరస్ అక్కడ నుండి హైదరాబాద్‌కు రోజుకు వేలాది మంది వ్యాపారం కోసం రాకపోకలు సాగించడంతో కరోనా మళ్లీ జడలు విప్పిందని వైద్యులు పేర్కొంటున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు నగరంలో 197 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీదవఖానలో ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తూ లక్షణాలున్న వారికి చికిత్సలు అందిస్తున్నారు. ప్రభుత్వం వైరస్‌పై ప్రజలు నిర్లక్షం చేయరాదని హెచ్చరిస్తూ మాస్కులు ధరించకుంటే జరిమానాలు వేస్తామని హెచ్చరికలు చేసిన ఇష్టానుసారంగా దుకాణాల వద్దకు వెళ్లడంతో మూడు రోజుల కితం ఫతేనగర్‌లో ఓషాపు యాజమాని మాస్కు లేకుండా దుకాణంలోకి వ్యక్తులకు అనుమతి ఇవ్వడంతో గమనించిన జీహెచ్‌ఎంసీ అదికారులు దుకాణం యాజమానిపై రూ. 2వేలు జరిమాన వేసి కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. అయిన కొన్ని ప్రాంతాల్లో ప్రజలు భౌతికదూరం పాటించకుండా గుంపులుగా తిరుగున్నారు.

వైద్యాధికారులు మాత్రం బార్లు, సినిమా థియేటర్లు, మాల్స్ మూసివేస్తే కరోనా వేగానికి కళ్లెం వేయవచ్చని భావిస్తున్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 80శాతం మందికి కరోనా లక్షణాలు లేకున్న పాజిటివ్ వస్తుందని చెబుతున్నారు.అదే విధంగా స్దానిక ప్రజలు కూడా అనుమానం ఉంటే వెంటనే సమీపంలోని పట్టణా ఆరోగ్య కేంద్రాలు, బస్తీదవాఖానలో పరీక్షలు చేసుకోవాలని సూచిస్తున్నారు. రోజుకు 50మంది ఉచితంగా టెస్టులు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశామని పేర్కొంటున్నారు. కుత్బులాపూర్, కూకట్‌పల్లి, అల్వాల్, మల్కాజిగిరి, ఉప్పల్, మలక్‌పేట వంటి ఆరోగ్య కేంద్రాల్లో టెస్టుల కోసం ప్రజలు బారులు కడుతున్నట్లు వైద్య సిబ్బంది వెల్లడిస్తున్నారు. నగర ప్రజలు కరోనా టీకా వచ్చిందని, కోవిడ్ నిబంధనలు పాటించకుంటే ప్రాణాలకు ముప్పతప్పదని జిల్లా వైద్యాదికారులు హెచ్చరిస్తున్నారు. బయటకు వెళ్లితే ముఖానికి తప్పకుండా మాస్కులు, చేతులకు శానిటైజర్ వినియోగించాలని, అదే విధంగా వైరస్ వ్యాప్తిచెందకుండా స్దానిక ఆరోగ్య కార్యకర్తలు, అంగన్‌వాడీ, ఆశలతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News