- Advertisement -
న్యూఢిల్లీ : కాన్పూర్ కేంద్రంగా పనిచేస్తున్న డిఆర్‌డివొ లేబొరేటరీ తేలికపాటి బులెట్ ప్రూఫ్ జాకెట్‌ను తయారు చేసింది. ఆర్మీ ఉపయోగించేలా దీని బరువు 9 కిలోలకు పరిమితం చేశారు. చండీగఢ్ టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చి ల్యాబ్ వద్ద దీని ప్రమాణాలు పరీక్షించారు. ఆర్మీ కొత్త జాకెట్ ను తయారు చేసినందుకు డిఆర్‌డిఒను లాబ్ డిఎంఎస్‌ఆర్‌డిఇని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాధ్ అభినందించారు. ఆత్మనిర్భర్ భారత్ ఆశయ సాధనకు ఇటువంటి కొత్త ఆవిష్కరణలు రూపొందించాలని ఆయన ట్వీట్ చేశారు.
Lightweight bullet proof jacket for Indian Army
- Advertisement -