Saturday, November 23, 2024

ఆ 11 రాష్ట్రాలు యమ డేంజర్

- Advertisement -
- Advertisement -

Centre Says 11 states cause of grave concern

రాష్ట్రాలు తక్షణమే మరింత మెరుగైన చర్యలు తీసుకోవాలి
కరోనా విజృంభణపై రాష్ట్రాలతో కేంద్రం అత్యున్నత స్థాయి భేటీ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలు, డిజిపిలు, ఆరోగ్య కార్యదర్శులు పాల్గొన్నారు. 11 రాష్ట్రాల్లో ‘ తీవ్రమైన ఆందోళనకర పరిస్థితులు’ ఉన్నట్లు ఈ సమావేశంలో గౌబా తెలిపారు. మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, కేరళ, చత్తీస్‌గఢ్, చండీగఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ హర్యానా రాష్ట్రాల్లోనే దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో 90.5 శాతం నమోదవుతున్నాయని ఆయన తెలిపారు.గత కరోనా సమయంలో కంటే ఈ సారి ఈ 11 రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు విపరీతంగా పెరిగాయని ఆయన తెలిపారు. ఈ రాష్ట్రాల్లో నిబంధనలు పాటించని వారిపై పోలీసు చట్టం, విపత్తుల నిర్వహణ చట్టాన్ని ఉపయోగించడంతో పాటుగా ఇతర న్యాయపరమైన, పాలనా పరమైన చర్యలను తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం ఈ సమావేశంలో కోరింది.

గత కరోనా దశకంటే ఈ సారి ఈ 11 రాష్ట్రాల్లో కేసులు విపరీతంగా పెరిగాయని, మరో ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే పెద్ద నగరాలే కాకుండా టైర్ టూ, త్రీ పట్టణాల్లో ఈ సారి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, వీటినుంచి వైద్య సదుపాయాలు సరిగా లేని గ్రామీణ ప్రాంతాలకు వైరస్ విస్తరిస్తే పరిస్థితి మరింత విషమంగా మారుతుందని కేంద్రం అభిప్రాయపడింది. మహారాష్ట్ర విషయంలో మాత్రం తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని కేంద్రం పునరుద్ఘాటించింది. కోవిడ్ కేసుల విషయంలో తక్షణమే మరింత మెరుగైన చర్యలు తీసుకోవాలని, రాష్ట్రాలు తమ వద్ద ఉన్న అన్ని వనరులను వైరస్ కట్టడికి వినియోగించాలని కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News