న్యూఢిల్లీ: అస్సాం మంత్రి, బిజెపి నాయకుడు హిమంత బిస్వ శర్మపై విధించిన 48 గంటల ప్రచార నిషేధాన్ని ఎన్నికల కమిషన్ శనివారం సడలించింది. బేషరతుగా క్షమాపణ చెప్పడంతోపాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి తాను కట్టుబడి ఉంటానని శర్మ హౠవీ ఇవ్వడంతో నిషేధ సమయాన్ని 24 గంటలకు ఎన్నికల కమిషన్ సవరించింది. శనివారం సాయంత్రం నుంచి ఆయన తన ప్రచారాన్ని కొనసాగించారు.
బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ అధినేత హగ్రామ మోహిలారిపై బెదిరింపు వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణపై ఆదివారం వరకు శర్మ ఎన్నికల ప్రచార కార్యకలాపాలపై నిషేధం విధిస్తూ శుక్రవారం ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేసింది. అస్సాం అసెంబ్లీ ఎన్నికల మూడవ, తుది దశకు సంబంధించిన ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగియనున్నది. ఏప్రిల్ 6వ తేదీన తుది దశ పోలింగ్ జరగనున్నది. వచ్చే మంగళవారం జరగనున్న పోలింగ్లో తాను పోటీ చేస్తున్న నియోజకవర్గం కూడా ఉందని, తన ప్రచారంపై విధించిన నిషేధాన్ని 24 గంటలకు తగ్గించాలని శనివారం ఎన్నికల కమిషన్కు ఇచ్చిన విజ్ఞాపన పత్రంలో శర్మ అభ్యర్థించారు.