Friday, November 15, 2024

బంగ్లాదేశ్‌లో 7 రోజుల లాక్‌డౌన్

- Advertisement -
- Advertisement -
7 days lockdown in bangladesh
అత్యవసర సేవలు, పరిశ్రమలకు మినహాయింపు

ఢాకా: ఈ నెల 5 నుంచి వారం రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తున్నట్టు బంగ్లాదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఇటీవల కరోనా కేసులు, మరణాలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నది. అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసి వేయాలని ఆదేశించింది. పరిశ్రమల్లో కార్మికులు 50 శాతంమేర షిఫ్టులవారీగా పని చేయడానికి అనుమతిచ్చారు. 50 శాతం ప్రయాణికులతో బస్సులు నడిపేందుకు అనుమతిచ్చారు. అయితే, కొవిడ్19 నియంత్రణ నిబంధనలు పాటించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. అన్ని రకాల సభలు, సమావేశాలపై నిషేధం విధించారు. శుక్రవారం ఒక్క రోజే 6830 కేసులు, 50 మరణాలు నమోదయ్యాయి. కరోనా గతేడాది ఆ దేశంలోకి ప్రవేశించిననాటి నుంచి కేసుల సంఖ్య ఇదే అత్యధికమని తెలిపింది. బంగ్లాదేశ్‌లో ఇప్పటి వరకు మొత్తం 6,24,594 కేసులు, 9155 మరణాలు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News