Sunday, November 24, 2024

కోళ్ల పరిశ్రమకు ఎండదెబ్బ

- Advertisement -
- Advertisement -

భారీగా తగ్గిన బ్రాయిలర్ చికెన్ ‌ఉత్పత్తి
కొండెక్కుతున్న మాంసం ధరలు.. కిలో రూ.260
మహారాష్ట్ర కోళ్లకోసం పరుగులు
కరోనాతో భయం… భయం!

Hens dead with heat in summer

మనతెలంగాణ/హైదరాబాద్ : ఏప్రిల్ తొలివారంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల ధాటికి రాష్ట్రంలో కోళ్ల పరిశ్రమ గిజగిజలాడుతోంది. అసలే కరనో ప్రభావంతో కోళ్ల పెంపకం దారులు గత ఏడాది నుంచి యూనిట్లను,చిక్ బ్యాచ్‌లను కుదించుకుంటు వస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా గత వేసవిలో కోళ్లఫారాలను వదిలి సొంతవూళ్లుకు వెళ్లిన కూలీల్లో అధికశాతం మంది ఇప్పటిదాక తిరిగి రానేలేదు. దీంతో ఫౌల్ట్రీ యాజమాన్యాలు బ్రాయిలర్ చిక్స్ సంఖ్యను వారికి ఉన్న సౌలభ్యతను బట్టి 75శాతం, కొందరు 50శాతం తగ్గించుకుంటూ వస్తున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర మంతటా మాంసం కోళ్ల ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. దీంతో పాటు సహజంగానే వేసవిలో కోళ్ల పరిశ్రమ మందగిస్తుంది. ఉన్న యూనిట్లలో కూడా ముదురుతున్న ఎండలు, పెరగుఉతున్న ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల నుంచి కోళ్లను కాపాడుకునేందుకు తలప్రాణం తోకలోకొస్తుందని బ్రాయిలర్ పరిశ్రమ నిర్వాహకలు చెబుతున్నారు. షెడ్లలో ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు పట్టాలు కప్పి గంటకోసారి నీళ్లతో నాన్పుతూ , కూలర్లు వాడుతున్నారు. బ్రాయిలర్ కోల్ల ఉత్పత్తి తగ్గిపోవటంతో మార్కెట్‌లో అవసరాలకు తగినన్ని కోళ్లను సరఫరా చేయలేక చేతులెత్తేస్తున్నారు. వర్షాకాలం వచ్చే దాక ఉత్పత్తి పెరగదని ఫౌల్ట్రీ యాజమాన్యాలు చెబుతున్నాయి.
కిలో రూ.260కి చేరిన మాంసం

మార్కెట్‌లో కోడిమాంసం ధరలు ఎండలతో పోటీ పడు తూ భగ్గున మండిపోయతున్నాయి. ఆదివారం కిలో కోడి మాంసం స్కిన్‌లెస్ రూ.260కి చేరుకుంది. గత వారం రూ.230 ఉన్న ధర కేవలం ఏడురోజుల్లోనే 30రూపాయలు పెరిగాయి. గత డిసెంబర్‌లో కిలో రూ.90ఉన్న చికెన్ ధరలు జనవరి నుంచి ఇక నిలకడలేకుండా పరుగు లు పెడుతూనే ఉన్నాయి. అంతంత ధరలు పెట్టి కొంటు న్నా అది కూడా కండపట్టిన కోడిమాంసం దొరకటం లేదని వినియోగదారులు చెబుతున్నారు. పెరిగిన ధరలతో ఉన్నకోళ్లను అమ్మి సొమ్మచేసుకునేందుకు బ్రాయిలర్స్ యూనిట్ల నిర్వాహకులు ఇంకా ఎదిగీ ఎదగని కోళ్లను కూడా మార్కెట్‌కు తరలిస్తున్నా రు. దీంతో సరైన బ్రాయిలర్ కోడి మాంసం రుచిలేకుండా పోతోందని వినియోగదారులు పెదవి విరుస్తున్నారు. రాష్ట్రంలో బ్రాయిలర్ కోళ్ల సంఖ్య తగ్గిపోయి మార్కెట్‌లో కోడిమాంసానికి డిమాండ్ పెరగటంతో వ్యాపారులు పోరుగున ఉన్న మహారాష్ట్రకు పరుగులు తీస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం లో కోళ్ల పరిశ్రమ జాతీయస్థాయిలో అగ్రభాగాన నిలిచినప్పటికీ తాత్కాలికంగా ఏర్పడిన కోరతతో సతమతమవుతోంది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు వ్యాపారులు మహారాష్ట్ర నుంచి కోళ్లు కొనుగోలు చేసి ఇక్కడికి తెస్తున్నారు.

తెలంగాణ కంటే మహారాష్ట్రలో కోళ్ల ధరలు 15నుంచి20శాతం తక్కుగా ఉంటాయని అందువల్లే రవాణ ఖర్చులు, దారిలో కొళ్లు చనిపోయిన కారణంగా వచ్చే నష్టాలు కలిపినా, అక్కడి కోళ్లను ఇక్కడికి తెచ్చి విక్రయించడం ద్వారా గిట్టుబాటుగానే ఉంటుందని వ్యాపారలు చెబుతున్నారు. ఈశాన్య కర్ణాటక రాష్టం నుంచి కూడా కొందరు వ్యాపారులు కోళ్లను కొని తెస్తున్నారు. కరోనా సెంకండ్ వేవ్ ప్రభంజనం ప్రజలను నీడలా వెంటాడుతోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగు తూ వస్తోంది. అందులోనూ మహారాష్ట్రలో కరోనా వైరస్ విశ్వరూపం చూపుతోంది. అక్కడి శివసేనసంకీర్ణ సర్కా రు పలు జిల్లాల్లో కరోనా కట్టడికోసం లాక్‌డౌన్ అమలు చేస్తోంది. ఈ నేపధ్యంలో అక్కడి ఫౌల్ట్రీ యాజమాన్యాలు కూడా ఎక్కడ చికెన్ మార్కెట్ పడిపోతుందో అన్న ఆందోళనతో ముందు జాగ్రత్తగా యూనిట్లలో ఉన్న కోళ్లను వీలైనంత వేగంగా వదిలించుకోవాలని చూస్తున్నారు. మన వ్యాపారులు గత వారం రోజులుగా మహారాష్ట్ర కోళ్లకు మొగ్గు చూపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News