Saturday, November 23, 2024

చిట్టీల పేరుతో రూ.4.5 కోట్లకు టోకరా

- Advertisement -
- Advertisement -

Rs 4.5 crore was Fraud in name of Chitti

 

హైదరాబాద్ : నగరంలో తాజాగా ఓ మహిళ చిట్టీల పేరుతో రూ.4.5 కోట్లు వసూలు చేసి పరారైన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ పరిధిలో చోటు చేసుకుంది. మోసపోయామని భావించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళ్తే.. హయత్‌నగర్‌ పరిధి ప్రగతినగర్‌కు చెందిన సప్పిడి పూలమ్మకొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం నడుపుతోంది. స్థానికంగా సొంత ఇల్లు కూడా ఉంది. చుట్టుపక్కల వాళ్లతో ఎంతో నమ్మకంగా మెదులుతూ అధిక వడ్డీల ఆశ చూపి వారి నుంచి చిన్న చిన్న మొత్తాలను సేకరించింది.

కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం నడుపుతుండటంతో నమ్మిన చాలా మంది ఆమెకు చిట్టీలు కట్టారు. కొందరు చిట్టీలు ఎత్తుకుని తిరిగి ఆమె రూ.2 చొప్పున వడ్డీ ఇస్తుంటుంది. ఇలా డబ్బులు సర్దుబాటు చేస్తూ అప్పులు చేసి దాదాపు రూ.4.5 కోట్లు వసూలు చేసింది. గత కొంతకాలంగ పూలమ్మ చిట్టీలు ఎత్తినవారికి, అప్పులవారికి డబ్బులు ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ వారికి కనిపించకుండా పోయింది. ఆమె కనిపించకపోవడంతో ఆమె ఇంటి వద్ద బాధితులు ఆందోళనకు దిగారు. ఇంట్లో లేకపోవడంతో ఆమె కుమారుడు నరేష్‌ను డబ్బులు ఇవ్వాల్సిందిగా బాధితులు డిమాండ్‌ చేశారు. దీంతో కుమారుడు నరేష్‌ తనకు సంబంధంలేదని చెప్పడంతో బాధితులు ఆదివారం హయత్‌నగర్ పోలీసులను ఆశ్రయంచి పిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News