- Advertisement -
కరోనా తీవ్రత, వ్యాక్సినేషన్‌పై సమీక్షించనున్న ప్రధాని
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 8న ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఇటీవల కొవిడ్19 కేసులు అనూహ్యంగా పెరుగుతున్నతీరు, వ్యాక్సినేషన్‌పై ప్రధాని సమీక్షించనున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. మార్చి 17న ముఖ్యమంత్రులతో వర్చువల్ సమావేశం సందర్భంగా ప్రధాని పలు సూచనలు చేశారు. కరోనా సెకండ్ వేవ్‌ను కట్టడి చేయడం కోసం వేగవంతంగా, నిర్ణయాత్మక చర్యలు చేపట్టాలని ప్రధాని సూచించారు. ఆదివారం ఇదే అంశంపై ప్రధాని ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. కరోనా కట్టడికి ఐదంచెల వ్యూహం అనుసరించాలని ప్రధాని సూచించారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ నెల 6 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని కూడా ఉన్నతాధికారులను ప్రధాని ఆదేశించారు.
- Advertisement -