Saturday, November 23, 2024

పోకిరీల వెర్రివెషాలు

- Advertisement -
- Advertisement -

మహిళలపై పెరుగుతున్న వేధింపులు, సైబరాబాద్‌లో పోకిరీలపై కేసులు, షీటీమ్స్‌కు 156 ఫిర్యాదులు
68 మందిపై కేసులు నమోదు, పనిచేస్తున్న 11 షీటీమ్స్

Sexual assault on women in hyd

మన తెలంగాణ/సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి మార్చిలో షీటీమ్స్ బాధితులు ఫిర్యాదులు చేశారు. వాట్సాప్, ఈమెయిల్, హాక్‌ఐ తదితర వాటి ద్వారా 154 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. వాట్సాప్ ద్వారా114, డైరెక్ట్‌గా 32, హాక్‌ఐ ద్వారా 3, ఈ మెయిల్‌తో ఒకరు, ట్విట్టర్ ద్వారా 4, క్యూఆర్ కోడ్ ద్వా రా ఇద్దరు ఫిర్యాదు చేశారు. ఇందులో 68 మంది పోకిరీలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. షీటీమ్స్ పోలీసులు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 591 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించారు. బస్‌స్టాప్, షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్లు, ట్యూటోరియళ్లు, కాలేజీలు తదితర ప్రాంతాల్లో ని ర్వహించారు. డెకాయ్ ఆపరేషన్‌లో 66 మందిని రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 422 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పోకిరీలకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. నిందితుల్లో 22 మంది మైనర్లు ఉ న్నారు. వేధింపులకు గురవుతున్న వారు సైబరాబాద్ షీటీమ్స్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు. వాట్సాప్ నంబర్ 9490617444కు ఫోన్ చేయాలని కోరారు.

బాలికకు లైంగిక వేధింపులు….

బాలానగర్‌కు చెందిన బాలిక లాక్‌డౌన్ సమయంలో తల్లిదం డ్రులతో కలిసి సొంత గ్రామం నాగర్‌కర్నూలుకు వెళ్లింది. ఆ సమయంలో తన కజిన్ మోక్కాతాల శివప్రసాద్‌తో సన్నిహితంగా ఉంది. ఆ సమయంలో ఇద్దరు కలిసి ఫొటోలు తీసుకున్నారు. తిరిగి నగరానికి వచ్చిన తర్వాత బాలిక పాఠశాలకు వెళ్లిన నిందితుడు తనను ప్రేమించాలని లేకుంటే ఫొటోలు సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించాడు. షీ టీమ్స్ పాఠశాలలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.

Sexual assault on women in hyd

ఫోన్‌లో వేధింపులు…

ఉద్యోగం కోసం తన ఇంటి సమీపంలో ఉన్న ఫార్మా కంపెనీకి దరఖాస్తు చేసుకున్న వివాహితకు ఫోన్ చేసి వేధింపులకు దిగారు. లైంగికంగా తనకు ఫేవర్ చేయాలని ఇంటర్నేషనల్ నంబర్ల నుంచి ఫోన్ చేసి వేధింపులకు గురి చేశాడు. తనకు వివాహం అయిందని, ఇద్దరు పిల్లలకు ఉన్నారని చెప్పినా నిందితుడు వేధింపులు మానలేదు. వివిధ నంబర్ల నుంచి ఫోన్లు చేసి వేధింపులకు గురిచేస్తున్నాడు. బాధితురాలు భరించలేక షీటీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. నిందితుడిని దుండిగల్ పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Sexual assault on women in hyd

మహిళకు బాలుడి వేధింపులు…

బాచుపల్లికి చెందిన మహిళ(32)కు ఓ బాలుడు రోజు వివిధ నంబర్ల నుంచి ఫోన్ చేసి బూతులు తిడుతూ వేధింపులకు గురిచేస్తున్నా డు. ఇలా గత ఆరు నెలల నుంచి చేస్తున్నాడు. బాధితురాలు కూకట్‌పల్లి షీటీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. బాలుడి వాట్సాప్ ప్రొఫైల్ ఫిక్చర్ ఆధారం గా బాలుడి చిరునామా కనుగొన్నారు. సిద్ధిపేట జిల్లా, వర్గల్ మండలం, సీతారాంపల్లి గ్రామినికి చెందిన బాలుడిగా గు ర్తించి గ్రామ సర్పించ్‌కు చెప్పి కౌన్సెలింగ్ ఇచ్చారు.

సినిమాకు రమ్మని వృద్ధుడి వేధింపులు…

కూకట్‌పల్లి బస్‌స్టాప్‌కు వచ్చే యువతలను మియాపూర్‌కు చెందిన వెంకటేశ్వరరావు (60) వేధింపులకు గురిచేస్తుండా షీ టీమ్స్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బస్‌స్టాప్ వచ్చే యువతులను డిన్నర్, సినీమాకు రావాలని వేధింపులకు గురిచేస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News