- Advertisement -
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో రాత్రి కర్ఫ్యూ విధించింది. ఈ నెల 30 వరకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ మంగళవారం ఆదేశాలు జారీచేసింది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కర్ఫ్యూ ఆంక్షలు నేటి నుంచే అమలవుతాయని ఢిల్లీ సర్కార్ వెల్లడించింది. అవసరమైన సేవలను కాకుండా ప్రజల కదలికలను తనిఖీ చేయడానికి నైట్ కర్ఫ్యూ అమలు చేయబడుతుందని ప్రభుత్వం తన ఉత్తర్వులో తెలిపింది. సోమవారం ఢిల్లీలో 3,548 తాజా కేసులు, 15 మరణాలు నమోదయ్యాయి.
Night Curfew In Delhi From 10 pm To 5 am
- Advertisement -