- Advertisement -
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఏడు గంటలపాటు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మంగళవారం నుంచి ఏప్రిల్ 30 వరకు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫూ అమలులో ఉంటుందని తెలిపారు. అయితే, కర్ఫ్యూ నుంచి అత్యవసర సేవలు, రైల్వే, విమానాశ్రయాల ఉద్యోగులు, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, మీడియా సిబ్బందిలాంటివారికి మినహాయింపు ఇచ్చారు. ఢిల్లీ ప్రస్తుతం కరోనా ఫోర్త్ వేవ్‌ను ఎదుర్కొంటోందని కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు.
Kejriwal announces night Curfew in Delhi
- Advertisement -