ఫోటోలు విడుదల చేసిన మావోయిస్టులు
హైదరాబాద్: మావోయిస్టుల చెరలో ఉన్న రాకేశ్వర్ సింగ్ సురక్షితంగా ఉన్నాడని బుధవారం నాడు ఒక ఫొటోను విడుదల చేశారు. లేఖ విడుదల చేసిన అనంతరం మావోయిస్టులు రాకేశ్వర్ సింగ్ ఫొటోను సైతం విడుదల చేశారు. చర్చలు జరగనంత వరకూ రాకేశ్వర్ తమ దగ్గర సురక్షితంగా బందీగా ఉంటాడని లేఖలో పేర్కొన్నారు. తమ షరతులను అంగీకరించేంత విడుదల చేయడం కుదరదంటూ స్పష్టంచేశారు. అయితే మావోయిస్టులు విడుదల చేసినట్లు పేర్కొంటున్న ఈ ఫొటో పాతదని రాకేశ్వర్ సింగ్ కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఫొటో ఏడాది క్రితం నాటిదని తెలిపారు.ఇదిలాఉంటే.. రాకేశ్వర్ విడుదలపై ప్రభుత్వం జాప్యం చేస్తోందని.. ఎలాంటి చర్యలు తీసుకోడం లేదంటూ ఆయన కుటుంబం ఆరోపించింది. ఈ మేరకు జమ్మూలోని రాకేశ్వర్ కుటుంబం జమ్మూ-పూంచ్ రహదారిపై ఆందోళన నిర్వహించింది. కుటుంబం ఐదు రోజుల నుంచి రాకేశ్వర్ విడుదల సమాచారం కోసం ఎదురుచూస్తోందంటూ గ్రామస్థులు పేర్కొన్నారు.
Maoists release photograph of missing Cobra commando