Friday, November 22, 2024

‘ముగిసిన టిడిఎల్‌పి చరిత్ర’.. టిఆర్‌ఎస్‌ఎల్‌పిలో విలీనం

- Advertisement -
- Advertisement -

టిఆర్‌ఎస్‌ఎల్‌పిలో టిడిపి శాసనసభా పక్షం విలీనం
టిడిపి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన
ఏకైక టిడిపి ఎంఎల్‌ఎ మెచ్చా నాగేశ్వరరావు
సండ్రతో కలిసి స్పీకర్ పోచారంకు లేఖ అందజేసిన మెచ్చా
తెలంగాణ శాసనసభలో ప్రాతినిధ్యం కోల్పోయిన టిడిపి

TDP Legislative Party merges with TRSLP

రాష్ట్ర అసెంబ్లీలోని ఇద్దరే ఇద్దరు టిడిపి సభ్యులు సండ్ర వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావుల అభ్యర్థన మేరకు విలీనానికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అంగీకారం
రాజ్యాంగం 10వ షెడ్యూల్ 4వపేరా కింద ఆమోదించినట్టు శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు అధికారిక ప్రకటన
ఇక నుంచి పూర్తిస్థాయి టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలుగా సండ్ర, మెచ్చా, ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలుసుకొని తమ నిర్ణయాన్ని ఆమోదించవలసిందిగా కోరుతూ లేఖ అందించిన ఎంఎల్‌ఎలు

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మిగిలిన ఏకైక ఎంఎల్‌ఎ మెచ్చా నాగేశ్వరరావు అధికార టిఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పటికే టిడిపి నుంచి గెలిచిన సత్తుపల్లి ఎంఎల్‌ఎ సండ్ర వెంకటవీరయ్య గులాబీ పార్టీలో చేరగా, తాజాగా అశ్వారావుపేట ఎంఎల్‌ఎ మెచ్చా నాగేశ్వరరావు కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నారు. దాంతో రాష్ట్రంలో టిడిపికి ఉన్న ఇద్దరు ఎంఎల్‌ఎలూ టిఆర్‌ఎస్ మద్దతు తెలిపినట్లయింది. ఈ మేరకు బుధవారం టిడిపి శాసనసభాపక్షాన్ని టిఆర్‌ఎస్ శాసనసభాపక్షంలో విలీనం చేస్తూ ఎంఎల్‌ఎలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావులు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి లేఖను అందజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. టిఆర్‌ఎస్‌ఎల్‌పిలో తెలంగాణ టిడిపి శాసనాసభా పక్షాన్ని విలీనం చేస్తున్నట్లు వెల్లడించారు.
2018లో టిడిపి నుంచి ఇద్దరు ఎంఎల్‌ఎల గెలుపు
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి తరఫున కేవలం ఇద్దరు మాత్రమే ఎంఎల్‌ఎలుగా విజయం సాధించారు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం నుంచి మెచ్చా నాగేశ్వర్ రావు, సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య గెలుపొందారు. వారు పదవీ ప్రమాణ స్వీకారం చేయక ముందే టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. తరువాత కొంతకాలానికి ఎంఎల్‌ఎ సండ్ర వెంకట వీరయ్య గులాబీ పార్టీలో చేరగా, తాజాగా మెచ్చా నాగేశ్వర్ రావు టిడిపికి రాజీనామా చేశారు. అనంతరం టిడిపిఎల్‌పిని టిఆర్‌ఎస్‌ఎల్‌పిలో విలీనం చేస్తున్నట్లు ఎంఎల్‌ఎ సండ్ర వెంకట వీరయ్యతో కలిసి ఎంఎల్‌ఎ మెచ్చా నాగేశ్వర్ రావు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి లేఖ అందజేశారు. దీంతో తెలంగాణ శాసనసభలో టిడిపికి ప్రాతినిథ్యం లేనట్టు అయింది.

TDP Legislative Party merges with TRSLP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News