Sunday, November 24, 2024

అభిమానం చాటింది..

- Advertisement -
- Advertisement -

సారును చూసేందుకు కాలువ దాటింది
ప్రజాప్రతినిధులకు గొప్ప సంతృప్తినిచ్చేది ఇదే : హరీష్

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రజల మనసుల్లో కెసిఆర్ పట్ల ఏ స్థాయిలో అభిమానం, కృతజ్ఞత గూడుకట్టుకొని ఉందో మంగమ్మ సాహసం తెలియజేసింది. హల్దీవాగులోకి గోదావరి జిలాలను విడుదల చేయ డానికి వస్తున్న కెసిఆర్‌ని చూడ్డం కోసం ఆమె 30 అడుగుల లోతైన కాలువలోకి దిగి దాటిన వైనం నిజంగా పెద్ద సాహసకృత్యం. ఇటువంటి సంఘటనలు చూసినప్పడు తనలాంటి ప్రజా ప్రతినిధులకు గొప్ప సంతృప్తి కలుగుతుందని, ప్రజాసేవకు మరింతగా అంకితమయ్యేలా స్ఫూర్తి కలుగుతుందని పై ఘటనను ఉదహరిస్తూ ఆర్థిక మంత్రి హరీష్‌రావు ట్విట్టర్ ద్వారా ఉదహరించారు.
సాహసం చేసిందిలా..
హల్దీవాగులోని గోదావరి జలాలను విడుదల చేసేందుకు సిఎం కెసిఆర్ వస్తారని తెలిసింది. అంతే అవతలి కట్ట మీద నుంచి సన్నని పైపు సాయంతో కాలవలోకి దిగింది మంగమ్మ. అక్కడనుంచి చదునుగా ఉన్న మార్గం మీదుగా వేదికవైపు పరుగులు తీసింది. ఈ సందర్భంగా ఆమెను పలకరించగా.. ‘రెండెకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న కూరగాయలు సాగు చేస్తున్నాం. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్ల నుంచి కొద్దిగా నీళ్లు వస్తున్నాయి. పంటలు సరిగా పండే పరిస్థితి లేదు. ఇప్పుడు కాలువలోకి నీళ్లు వస్తున్నాయంటే సంతోషంగా ఉంది. నాకు ఇద్దరు అబ్బాయిలు. బాగానే చదివించా. ప్రైవేటుగా చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. నీళ్లిచ్చినట్లే పిల్లలకు మేలు కలిగేట్లు ఏదైనా చేస్తే బాగుంటుందం’టూ తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించింది. జారిపడతారనే భయం లేకుండా అంత ఎత్తునుంచి ఎలా దిగావని అడుగగా ‘సారంటే అభిమానం’. చూద్దామని వచ్చా.. మొత్తానికి చూడగలిగానని మంగమ్మ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News