- Advertisement -
మనీలా: బ్రెజిల్‌లో కరోనా వైరస్ మృత్యుఘంటికలు మోగిస్తోంది. గత 24 గంటల్లో ఆదేశంలో 4195 మంది చనిపోయారు. కరోనా వైరస్ 1.31 కోట్ల మందికి వ్యాపించగా 3.41 లక్షల మంద మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 1.16 కోట్ల మంది కోలుకోగా 1.19 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. బ్రెజిల్ లోని సావోపా రాష్ట్రంలో వెయ్యి మరణాలు సంభవించాయి. కరోనా కేసుల సంఖ్యలో అమెరికా(3.16 కోట్లు) తొలి స్థానంలో ఉండగా వరసగా బ్రెజిల్(1.31 కోట్ల , భారత్(1.29 కోట్లు), ప్రాన్స్(48.41 లక్షలు), రష్యా(46.06 లక్షలు), యుకె(43.67 లక్షలు), ఇటలీ(37 లక్షలు) దేశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు బ్రెజిల్ దేశంలో 2.86 కోట్ల మంది కరోనా టెస్టులు చేశారు.
- Advertisement -