-వేసవి ఎఫెక్ట్
-పెరుగుతోన్న ఉష్ణోగ్రతలే
కారణమంటున్న ఇంజనీరింగ్ నిపుణులు
హైదరాబాద్ : నగరంలో రోజుకు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దాని పభావం మనుషుల మీదే కాదు వాహనాలపై కూడా పడుతోంది. సాధారణంగా ఏదైనా వాహనం నడిపితేనే దానిలో ఇంధనం ఖర్చు అవుతుంది. కాని ప్రస్తుత పరిస్థితుల్లో వాహనా పెట్రోల్ ట్యాంకుల్లో మాత్రం వాహనం నడపకుండా దానిలో ఉన్న ఇంధన ఖాళీ అవుతోంది. అసలే పెట్రోల్ ధరలు వేసవి ఉష్ణోగ్రతలతో పాటు సమానం మండి పోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వాహనాల ట్యాంకుల్లో పెట్రోల్ ఆవిరై పోతుండటంతో వాహన దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు పెరుగుతున్న ధరలు మరో వైపు వేసవి కారణంగా ట్యాంకుల్లో పెట్రోల్ ఆవిరికావడంతో ఏమీ చేయాలో అర్థం కావడం లేదంటున్నారు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వాహనాల్లోని ఇంధనం 20 శాతానికి మించి ఆవిరి అయిపోతోందని దాని ప్రభావం వాహన మైలేజ్‌పై చూపుతుంది. వాహనాల్లో లీటర్ పెట్రోల్ ఏ మాత్రం సరిపోవడంతో వాహనదారులపై ఆర్దిక భారం పడుతోంది. వేసవి ఉష్ణోగ్రతల కారణంగా వాహనాల్లో పెట్రోల్ ఆవిరి కావడంతో పాటు, వాహనాల టైర్లలో గాలి తగ్గడంతో ఆయా వాహనాల మైలేజ్ కూడా తగ్గుడంతో ఆర్దికంగా నష్టపోతామని చెబుతున్నారు. వీటిని నివారించేందుకు వాహనాలను ఎండలో కాకుండా చల్లని ప్రదేశాల్లో నిలిపాలంటున్నారు. ఒక వేళ నిలిపినా ఎక్కువ సమయంగా అక్కడే ఉండకుండా చర్యలు తీసుకోవాలని, అంతే కాకుండా వాహనాల టైర్లలో గాలిని రెండు మూడు రోజులకు ఒక సారి చెక్ చేసుకోవాలంపన్నారు. వేసవిలో వాహనాలకు రక్షణకు సంబంధించిన తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
* వాహనంలో పెట్రోల్ ఆవిరి కాకుండా ఉండాలంటే ద్విచక్ర వాహనాలయితే పెట్రోల్ ట్యాంక్‌పై వస్త్రంతో చేసిన ట్యాంక్ కవర్‌ను వినియోగించాలి.
* వాహనాలను ఎక్కువ సమయం ఎండలో నిలపరాదు.
* అధిక సమయంలో ఎండలో ఉంచాల్సిన అవసరం వస్తే ఆయా వాహనాలపై తడిదుస్తులను లేదా వొట్టివేళ్ళతో కూడిన ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకోవాలి.
* పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా పెట్రోల్ వాహనాల ట్యాంకులు పూర్తిగా నింపవద్దు.
* ద్విచక్రవాహనాలపై పెట్రోల్ ట్యాంక్‌లపై లెదర్ తయారు చేసిన కవర్లను వినియోగిరాదు.
* పెట్రోల్, సీఎన్జీ ఆధారంగా నడిచే వాహనాలను తరుచు చెక్ చేసుకోవాలి.
* వాహనాలను పచ్చని చెట్లు లేదనా నీడలో పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలి.
* వాహనాల ఇంజన్‌ను అధికం సమయం ఆన్‌లో ఉంచకూడదు.