Saturday, November 23, 2024

మావోయిస్టుల నుంచి రాకేశ్వర్‌కు విముక్తి

- Advertisement -
- Advertisement -

గురువారం సా.5గం.కు టెర్రం అడవుల్లో వందలాది మంది పల్లెప్రజల సమక్షంలో వదిలిపెట్టిన మావోయిస్టులు
మధ్యవర్తులతో పాటు బసగూడ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న జవాన్ రాకేశ్వర్ సింగ్
ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన రాకేశ్ భార్య మీనూ, కుటుంబసభ్యులు

మన తెలంగాణ/హైదరాబాద్: తమకు పట్టుబడిన సిఆర్‌పిఎఫ్ కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్‌ను మావోయిస్టులు గురువారం సాయంత్రం 5గంటలకు టెర్రం అడవుల్లో వదిలి పెట్టారు. ఐదు రోజులపాటు మావోయిస్టుల వద్ద బందీగా ఉన్న జవాన్ రాకేశ్వర్‌సింగ్ టెర్రం క్యాం పుకి సురక్షితంగా చేరుకున్నటు చత్తీస్‌గఢ్ డిజిపి ధృవీకరించా రు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ -సుక్మా జిల్లాల సరిహద్దుల్లో ఏప్రి ల్ మూడో తేదీన మావోయిస్టులు జరిపిన దాడిలో 24 మం ది సైనికులు మృతి చెందగా, మరో 31 మంది తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. మావోయిస్టులు దాడులు జరిపిన సమయంలోనే సిఆర్‌పిఎఫ్ జవాన్ రాకేశ్వర్ సింగ్‌ను నక్సల్స్ బంధీగా చేసుకున్నారు. బీజాపూర్ జిల్లా టెర్రెం కొండల్లో వ్యూహాత్మక యూ ఆకారంలో దాడులకు తెగబడి సిఆర్‌పిఎఫ్ జవాన్లను హతమార్చిన ఘటన జరిగిన అనంతరం ఏడుగురు జవాన్లు కనిపించకుండా పోయారని భద్రతా దళాల కమాండర్లు ప్రకటించారు. వీరిలో కొందరి ఆచూకీ దొరకగా మరికొందరు ఇంకా కొందరి ఆచూకీ తెలియరాలేదన్నది సమాచారం. ఈ ఏడుగురిలో ఒకరైన సిఆర్‌పీఎఫ్ కోబ్రా జవాన్ రాకేశ్వర్ సింగ్‌ను తమ వద్దే ఉన్నాడని మావోయిస్టులు ఏప్రిల్ అయిదో తేదీన ప్రకటించారు. ఏప్రిల్ ఏడో తేదీన రాకేశ్వర్ సింగ్ తమ వద్ద క్షేమంగా వున్నట్లు మావోయిస్టులు ఫోటో కూడా విడుదల చేశారు. రాకేశ్వర్ తమ వద్ద క్షేమంగా ఉన్నాడని, అతనికి ఎలాంటి హానీ తలపెట్టబోమని మావోయిస్టులు ప్రకటించారు.

ఈ మేరకు మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ లేఖ కూడా విడుదల చేశారు. అయితే రాకేశ్వర్ సింగ్ విడుదలకు మావోయిస్టులు షరతులు విధించారు. ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధమనే ప్రతిపాదనతో పాటు మధ్యవర్తులను ప్రకటిస్తే రాకేశ్వర్ సింగ్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. అలాగే అడవుల్లో ఏర్పాటు చేసిన భద్రతా బలగాల క్యాంపులను వెంటనే తొలగించాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. అప్పుడే రాకేశ్వర్ విడిచిపెడతామని షరతు విధించారు. జవాన్ తమ వద్ద క్షేమంగానే ఉన్నట్లు బుధవారం ఓ ఫొటోను కూడా విడుదల చేశారు.రాకేశ్వర్‌ను ఎలాగైనా సురక్షితంగా విడిపించుకురావాలని కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఆయన కూతురు సైతం తన నాన్నను విడిచిపెట్టాలని మీడియా ద్వారా నక్సల్స్‌ను కోరింది. ఈ పరిణామాల అనంతరం నేడు ఎట్టకేలకు రాకేశ్వర్ తిరిగి సురక్షింతంగా ఆయన భార్య మీనూ సంతోషం వ్యక్తం చేయడంతో పాటు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామస్థుల సమక్షంలో విడుదల
కోబ్రా జవాన్ రాకేశ్వర్ సింగ్‌ను పద్మశ్రీ ధర్మపాల్ సైని, గోండ్వానా సమాజ్ అధ్యక్షుడు తెలం బోరయ్య, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇద్దరు సభ్యులతో పాటు వందలాది మంది గ్రామస్తుల సమక్షంలో మావోయిస్టులు జవాన్ రాకేశ్వర్‌సింగ్‌ను విడుదల చేశారు. విడుదల తర్వాత మధ్యవర్తిత్వం కోసం వెళ్ళిన బృందం, జవాన్‌తో బసగుడ పోలీస్ స్టేషన్ కు తిరిగి వచ్చింది. జవాన్ విడుదల కోసం మధ్యవర్తిత్వం వహించిన ఇద్దరు సభ్యుల బృందంతో పాటు బస్తర్‌కు చెందిన 7 ఊర్ల జర్నలిస్టుల బృందం కూడా ఉంది. నక్సలైట్ల పిలుపు మేరకు జవాన్లను విడుదల కోసం చర్చల బృందంతో సహా మొత్తం 11 మంది సభ్యులు బస్తర్ ప్రాంతానికి వెళ్లినట్లు సమాచారం.

Maoists released Jawan Rakeshwar Singh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News