ముంబయికి వ్యాక్సిన్ కొరత.. శుక్రవారం నుంచి వ్యాక్సినేషన్ నిలిపివేత
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ నిల్వలు నిండుకోవడంతో శుక్రవారం నుంచి నగరంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ముంబయి నగర మేయర్ కిషోరీ పెడ్నేకర్ గురువారం వెల్లడించారు. నగరానికి అవసరమైనన్ని వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంటేనే వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని ఆమె అన్నారు. నగరానికి తక్షణమే వ్యాక్సిన్ సరఫరా జరిగితే తప్ప శుక్రవారం నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగే అవకాశం లేదని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ నిల్వలు ఈ రోజు(గురువారం)కు సరిపోతాయని, ఈ విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే ఇదివరకే ప్రకటించారని ఆమె గుర్తు చేశారు. ఇటుంటి ఘోరమైన పరిస్థితిని మహారాష్ట్ర ఎదుర్కోవడం ఇదే మొదటిసారని, ఇందుకు కేంద్ర ప్రభుత్వనికి బాధ్యతని ఆమె ఆరోపించారు. వ్యాక్సిన్ల కొరత కారణంగా ఇప్పటికే మొదటి డోసు టీకా తీసుకున్నవారికి రెండో డోసు వేసే పరిస్థితి లేదని కూడా ఆమె స్పష్టం చేశారు.
Vaccination dry stops from tomorrow in Mumbai