ప్రధాని మోడీకి రాహుల్ డిమాండ్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న ”పరీక్షా పే చర్చ” కార్యక్రమంపై కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపి రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నుల వల్ల కారులో ఇంధనం పోయించుకోవడం కూడా ప్రజలకు పరీక్షగా మారిందని, అందు వల్ల ”ఖర్చే పే చర్చ”(ఖర్చులపై చర్చ) కూడా జరగాల్సిందేనని రాహుల్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ పన్నుల వసూళ్ల కారణంగా కారులో ఇంధనం పోయించుకోవడం కూడా పరీక్ష రాయడంగా మారిందని, దీనిపై ప్రధాని మోడీ ఎందుకు చర్చించరు అంటూ రాహుల్ ప్రశ్నించారు. ఖర్చులపై కూడా చర్చ జరగాల్సిందేనని ఆయన గురువారం ట్వీట్ చేశారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై రాహుల్ గాంధీ గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోడీపై తీవ్ర విమర్శనాస్గ్రాలు సంధిస్తున్నారు. యుపిఎ ప్రభుత్వం తప్పుకున్న నాడు ఇంధనం ధరలు ఎంత ఉన్నాయో, నాటి పరిస్థితికి పెట్రోల్, డీజిల్ ధరలను తీసుకురావాలని ఆయన డిమాండు చేస్తున్నారు.