Saturday, November 9, 2024

ఆస్తిపన్నును సక్రమంగా చెల్లిస్తే 5 శాతం రాయితీ

- Advertisement -
- Advertisement -

GHMC offers 5 percent discount on property tax

ఎర్లీ బర్డ్ పేరిట రాయితీని ప్రకటించిన మున్సిపల్ శాఖ

హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరాని గాను (2021-22) ఆస్తిపన్నులో 5 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. ఎర్లీ బర్డ్ పేరిట ఈ రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. ఈ రాయితీని పొందాలంటే ఈనెల 30వ తేదీలోపు ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రతి సంవత్సరం ఆస్తి పన్నును వసూలు చేయడం అధికారులకు కత్తిమీద సాములాగ ఉంటుంది. ఎప్పటికప్పుడు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఫైన్‌లు వేస్తూ ఆస్తి పన్నులను అధికారుల వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి ఆస్తిపన్నును సమయానికి చెల్లించే వారికి ఎర్లీ బర్డ్ ఆఫర్‌ను వర్తింపచేయాలని మున్సిపల్ అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, నగర పాలక సంఘాల పరిధిలోని వారికి ఈ రాయితీ వర్తిస్తుందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 141 పట్టణ స్థానిక సంస్థల్లో ఈ రాయితీ అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.

TS Govt offers 5 percent discount on property tax

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News