హైదరాబాద్: రాష్ట్రంలో వ్యాక్సినేషన్ సంఖ్య భారీగా పెరిగింది. శుక్రవారం ఏకంగా 1,02,886 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరిలో 96385 మంది మొదటి డోసు, 6501మంది సెకండ్ డోసు వేసుకున్నట్లు ఆరోగ్యశాఖ వ్యాక్సిన్ బులిటెన్‌లో పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు 2,28,749 హెల్త్‌కేర్ వర్కర్లు తొలి డోసు తీసుకోగా, 1,72,396 మంది రెండో డోసు తీసుకున్నారు. అదే విధంగా 1,19,571 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు మొదటి డోసు తీసుకోగా, 68,266 మంది సెకండ్ డోసు వేసుకున్నారు. 45 ఏళ్లు పై బడిన వారిలో 1,15,1481 మంది మొదటి, 42,745 మంది రెండో డోసు తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 17,83,208 మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.
వ్యాక్సిన్ వేస్టేజ్ 2.51 శాతం…
రాష్ట్రంలో వ్యాక్సిన్ వేస్టేజ్ 2.51 శాతం నమోదైంది. కొవిన్ పోర్టల్‌లో 19.02.720 డోసులు రికార్డు కాగా, 40,540 ఆర్మీ, 33,130 బఫర్ స్టాక్ కింద తీసివేస్తే వ్యాక్సిన్ వేస్టేజ్ 2.51 శాతం మాత్రమే తేలింది. ఇదిలా ఉండగా రోజురోజుకి వ్యాక్సినేషన్‌కు ఆధరణ పెరుగుతుందని అధికారులు తెలిపారు. కరోనా తీవ్రత పెరగడంతోనే టీకా కొరకు సెంటర్ల వద్ద క్యూ కడుతున్నట్లు వైద్యశాఖ పేర్కొంది.