Friday, November 22, 2024

ప్రైవేట్ ఆస్పత్రులు మానవత్వంతో వ్యవహరించాలి: మంత్రి ఈటెల

- Advertisement -
- Advertisement -

Minister Etela Rajender Comments On Corona

హైదరాబాద్: ప్రైవేట్ ఆస్పత్రులు మానవత్వంతో వ్యవహరించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో శనివారం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ప్రతినిధులతో మంత్రి ఈటెల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కరోనా అంటే భయపడే పరిస్థితి పోయింది.. అయితే, జాగ్రత్తగా  ఉండాలి. ఏడాది కాలంలో ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్నాం. అన్ని చోట్లా వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వైద్యం కోసం హైదరాబాద్ కు వస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రులు అనగానే దోచుకుంటాయనే పరిస్థితి వద్దు. ప్రజల దృష్టిలో కార్పొరేట్ ఆస్పత్రులపై సరైన భావన లేదు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా వైద్యానికి ప్రభుత్వం ఫీజులు ఖరారు చేసింది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 14వేలకు పైగా బెడ్స్ ఉన్నాయి. కోవిడ్ ట్రీట్ మెంట్ తోపాటు నాన్ కోవిడ్ రోగులకు కూడా వైద్యం అందించాలి. నిబంధనల కంటే ఎక్కవ డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు’ అని పేర్కొన్నారు.

Etela Rajender meeting with private hospitals Officials

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News