Saturday, November 23, 2024

గూగుల్ మ్యాప్‌ను నమ్మి అత్తారింటికి దారితప్పాడు..!

- Advertisement -
- Advertisement -

Man nearly marries wrong woman after Google Map misleads

జకర్తా: గూగుల్ మ్యాప్‌ను నమ్మి ఓ మగ పెళ్లివారు దారితప్పి వేరే ఇంటికి వెళ్లిన ఘటన ఇండోనేసియాలో జరిగింది. సెంట్రల్ జావాలోని పాకిస్ జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. మగపెళ్లివారు ఆ జిల్లాలోని ఓ గ్రామానికి బదులు పక్కనే మరో గ్రామంలోని మరో ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో అమ్మాయి కుటుంబం నుంచి అతిథి మర్యాదలు కూడా స్వీకరించారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇంతలో ఆ ఇంటి అమ్మాయి మేరియా ఉల్ఫా తన కోసం వచ్చిన పెళ్లి కుమారుణ్ని చూసి అవాక్కయింది. దాంతో, పొరపాటు గ్రహించిన మగపెళ్లివారు ఉల్ఫా కుటుంబానికి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి నిష్క్రమించారు. ఈ పొరపాటుకు మరో కారణం ఉల్ఫాకు కూడా అదేరోజు మరో యువకుడితో ఎంగేజ్‌మెంట్ ఉండటం. నిశ్చితార్థం కోసం రావాల్సిన యువకుడి కుటుంబంలోని ఓ వ్యక్తి మార్గమధ్యంలో టాయిలెట్‌కు వెళ్లడంతో అక్కడికి చేరుకోవడంలో ఆలస్యమైంది. పెళ్లి కుమారుడు వెళ్లాల్సింది లొసారీ హామ్లెట్‌లోని గ్రామం కాగా, వారు పొరపాటున పక్కనే ఉన్న ఉల్ఫాకు చెందిన జెంకోల్ హామ్లెట్‌లోని గ్రామానికి వెళ్లినట్టు గుర్తించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News