మనతెలంగాణ/హైదరాబాద్: మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డికి ఆదివారం ఇడి సమన్లు జారీ చేసింది. ఇఎస్‌ఐ శ్కాంలో దర్యాప్తులో భాగంగా ఈ కేసులో నిందితులుగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి, ముకుందారెడ్డి, వినయ్‌రెడ్డి, దేవికారాణికి ఇడి సమన్లు జారీ చేసింది. 10 రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కుంభకోణంలో శ్రీనివాస్‌రెడ్డి, ముకుందారెడ్డి, దేవికారాణిదే కీలకపాత్రగా ఇడి భావిస్తోంది. బుర్ర ప్రమోద్ రెడ్డి డొల్ల కంపెనీలపై కూపీ లాగుతున్న ఇడి బృందం ఈ శ్కాం వెనుక నేతల ప్రమేయంపై ఆధారాలు సేకరిస్తోంది. ఇఎస్‌ఐ కుంభకోణంతో నగలు, ఆస్తులు కూడబెట్టుకున్నట్లు ఇడి అనుమానం వ్యక్తం చేస్తోంది. అక్రమ సొమ్ముతో కూడబెట్టిన ఆస్తులు అటాచ్ చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. అనిశా కేసుల ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఇడి దర్యాప్తు చేస్తోంది.
ED Summons to Nayini Narsimha reddy son in law